సరస్వతీ గాన సభ- కాకినాడ – అను పేరు వినని సంగీతాభిమానులు దక్షిణ భారతంలోనే లేరు. సరస్వతీ గానసభ శత సవత్సరోత్సవం చేసికొనుటకు అత్యంత ఆనందాయకం. సరస్వతీ గానసభ సనాతనమైనది. అప్పటికీ ఇప్పటికీ సరస్వతీ గానసభలో పాల్గొనుట కళాకారులకు ఒక ప్రత్యేక గౌరవం. ఈ సంస్థ సంగీత, నాట్య, నాటక కళలనేగాక, హరికథా కళను కూడా నమోదరించింది. ” హరికథా పితామహులు” శ్రీమదజ్జాడాదిభట్ల నారాయణదానవర్యులు ఈ సంస్థ వార్షికోత్సవములలో పాల్గొనెడి వారు. అదియునూగాక కీ శే శ్రీ ముసునూరి సూర్యనారాయణ భాగవతులు ”గాయకరత్న” అన్న బిరుదమును ఈ సంస్థ నుండి పొందినారట కదా ! ఈనాటికినీ, సరస్వతీ గానసభ వారూ, శ్రీరామ సమాజం వారు కూడా – గానసభలతో పాటు హరికథాగానాలను కూడా సమాదరిస్తున్నారు. యావదాంధ్రములలోను కలదారణకు కాకినాడ ప్రత్యేకమే.
ఆ రోజుల్లో దక్షిణ దేశం నించి విజయం చేస్తున్న సంగీత కాలసరస్వతి ఆంధ్ర జాతికి తొలిగా పరిచయమయ్యే వేదిక ‘సరస్వతీ గాన సభ’. దక్షిణాది మహావిద్వాంసులందరూ, మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ తరువాత మరలా అంతటి అరుదైనదిగానూ, అద్భుతమైనదిగాను భావించే అవకాశం ‘సరస్వతీ గానసభ’ కళావేదిక.
”సరస్వతీ గాన సభలో మహా విద్వాంసులు కచేరీలు విని, ఆ నాదానుభూతి లోంచి ఎన్నో అమూల్య విషయాలు తెలుసుకున్నాను” అని చాలా మాట్లు చెప్పారు మా గురువుగారు పద్మ భూషణ్, సంగీత కళానిధి డా శ్రీపాద పినాక పాణిగారు
సంగీతాన్ని అభ్యసించి, ఆరాధించి, అనుభవించిన ఆనందంతో, విన్న సంగీతాన్ని మళ్ళీ మళ్ళీ తలచుకొని తన్మయం చెందే వాళ్ళం.
సరిగ్గా పదహారు సంవత్సరాలక్రితం ఒకచోట సమావేశం అయి, గాలి, నీరు ఆహారం కన్నా కూడా సంగీతమే ముఖ్యమని, సంగీతం లేని బ్రతుకు వ్యర్థమని గాఢంగా అనుకున్నాం. మేము సైతం విశ్వవీణకు తంత్రులమై మూర్ఛనలు బోయి, నీరయి, సంగీత స్రవంతిలో కలిసి ప్రవహించాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాం.
అప్పటికే 84 సంవత్సరాలుగా సంగీతం సేవ చేస్తున్న సరస్వతీ గాన సభవారు మమ్మల్ని తల్లిలా ఆదరించి సూర్యకళామందిరం వేదికనిచ్చారు. అప్పటికే సుమారు 100 సంవత్సరాలుగా శ్రీరామ సమాజంవారు సభలకు సమర్ధంగా నిర్వహించడం లో ఓనమాలు దిద్దించారు.
వీళ్లిద్దరికీ చితికినవేళ్లు ఆసరాగా, తూలిపోతూ నడిచే పసిబిడ్డలా మా ప్రయాణం ప్రారంభం అయింది. ఇప్పటికి 16 సంవత్సరాలు పూర్తి చేసుకొని సర్వాంగ సుందరంగా ఎదిగింది. రాజీలేని నిబద్దతతో, క్రమ శిక్షణతో, ప్రతినెలా సూర్య కళామందిరంలో నాదోపాసన చేసే సంస్థగా సంగీతప్రియులు అభిమానాన్ని సంపాదించుకుంది.
సంగీతస్రవంతి సభ్యులైన శ్రీమతి అడ్డాల లలితాదేవి గారు గాత్ర సంగీతంలోనూ, శ్రీమతి టి.సీ-తమ్మారావుగారు వీణావాద్యంలోను, శ్రీమతి మేచురి కల్పకంగారు భారతనాట్యంలోను, సరస్వతీ గాన సభ స్వర్ణోత్సవాలలో ప్రధమ బహుమతులను అందుకున్నారని తెలియ చేయడానికి మేము సంతోషిస్తున్నాము.
చెన్నై మ్యూజిక్ ఎకాడమీతో సమానంగా పేరు మోసింది సరస్వతీ గానసభ. దీనిని స్థాపించి నూరు సంవత్సరాలయినది. ఈ సంవత్సర నూరు సంవత్సరాల ఉత్సవం చేసుకొంటున్నది. తెలుగుదేశంలో ఏ పట్టణంలో ఏ గానసభ వెలిసినా సరస్వతీ గానసభ ఆదర్శంతోనే. నేను ఈ సభను 65 ఏండ్ల క్రితం మొదటిసారిగా చూసాను. అప్పుడు దాని నిర్వాహకులు దివాన్ బహద్దూర్ కొమ్మిరెడ్డి సూర్యనారాయణమూర్తి గారు. వారు దానిని స్థాపించి వృద్ధిలోకి తీసుకొని వచ్చారు. అన్నదాన సమాజం హాలులో గానసభలు జరిగేవి. ఆ హాలులో కూర్చుండి గానం వింటుంటే గంధర్వలోకంలో ఉన్నట్లుండేది.
పండిత సదస్సుకు రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు అధ్యక్షత వహించారు. సర్వశ్రీ ద్వారం వెంకటస్వామినాయుడు, మునుగంటి వెంకట్రావు పంతులు, మంగిపూడి రామలింగ శాస్త్రి, మునుగంటి శ్రీరామమూర్తి, ద్వారం భావనారాయణ రావు, శ్రీరంగం నారాయణ బాబు, ఎం.వి. నరసింహాచార్యులు మున్నగువారు ఇందు పాల్గొన్నారు. శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు వందన సమర్పణ చేసారు.
మద్రాసు మ్యూజిక్ అకాడమీల రూపొందించాలని, సంగీత కళాశాల ఏర్పాటు చేయాలనీ ఇంకా కొన్ని గుణాత్మకమైన తీర్మానాలు ఆ సదస్సులో చేసారు.
”ద్యుమణి పద్మకరము వికచముగా జేయు గుముహర్షంబు గాలించు నమృత సూతి, యర్థితుడుగాక జలమిచ్చు నంబుధరుడు సజ్జనులు దారె పరహితా చరణమతులు”
”ఆరంభింపరు నీచమానవులు విఘ్నయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహన్యమాను లగుచున్ దృతున్నతోత్సాహులై ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్”
అటువంటి ఉత్తరములు మాకు శతవార్షికోత్సవాలకు సంచాలకులైన శ్రీమతి లక్కరాజు శేష కుమారి మరియు మా కార్యవర్గ సభ్యులు శ్రీ లక్కరాజు సత్యనారాయణ్ (టిక్కు)గరులు. మాకు ఆ భగవంతుడు పార్వతి, గణపతుల వలె ప్రసాదించిన ఆ జగనాత్మకు మరొక్కసారి నమస్కరిస్తూ భవన పునర్నిర్మాణమనకు అవసరమైన నిధులతో నేమి లేదా స్వంత పనులు మానుకుని పని ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు స్వంత వృత్తివ్యాపకాలను పక్కనపెట్టి తాము అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని ఉత్తములు వారు.
అన్నింటికి మించి ఈ ఉత్సవాలును ప్రారంభించడానికి దయతో అంగీకరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారులైన, భారత ప్రభుత్వంచే పద్మవిభూషణ్ గౌరవ పురస్కారం పొందిన సంగీత లోకమాన్యులు, వాగ్గేయకారులు మీదు మిక్కిలి సరస్వతీ గాన సభ అంటే అమితమైన ప్రేమానురాగాలను అమృతవర్షిణి వలె కురిపించే మా మంగళంపల్లి బాలమురళికృష్ణగారు అంగీకరించడం ఈ సరస్వతీ గానసభకు ఒక మణిహారం. మరి ఈ గానసభలలో ఆ తల్లి సరస్వతీదేవికి అలంకరించడానికి వచ్చిన కళాకారులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అవకాశాన్ని రసజ్ఞులైన ప్రజానీకానికి, ముఖ్యంగా కాకినాడ ప్రాంతీయ రసజ్ఞులందరికీ అవకాశం కలిపించడానికి కారకులైన కార్యక్రమ దాతలందరికీ ఈ సంగీత ప్రపంచ ఎంతో రుణపడి ఉంటుంది.